హీరోయిన్ దొరకక స్టార్ట్ కాని అఖిల్ మూవీ

మూడు సినిమాలు పరాజయం తరువాత అఖిల్ తన నాలుగో సినిమాను స్టార్ట్ చేయనున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో అఖిల్ తన నాలుగో సినిమా చేయనున్నాడు. ఆల్రెడీ సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ కూడా కంప్లీట్ అయిపోయింది. కానీ ఇంతవరకు సినిమా సెట్స్ మీదకు వెళ్లలేదు. కారణమేంటి అని ఆరా తీస్తే హీరోయిన్ ఇంకా ఫైనల్ అవ్వకపోవడమే అని తెలుస్తుంది. సాధారణంగా సినిమా స్టార్ట్ చేసిన తరువాత, లేదా ఫస్ట్ షెడ్యూల్ అయిన తర్వాత తాపీగా హీరోయిన్ ను సెలక్ట్ చేస్తారు. కానీ ఇక్కడ హీరోయిన్ ఎవరో తేలేవరకు ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లదు అని చెబుతున్నారట.

హీరోయిన్ ఎవరో తేలాలి…

హీరోయిన్ దొరికే వరకు బొమ్మరిల్లు భాస్కర్ తో పాటు నిర్మాత అల్లు అరవింద్ కూడా సినిమా స్టార్ట్ చేయొద్దు అని చెప్పాడట. డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ ఆ విధంగా స్టోరీ రాసుకున్నాడట. అఖిల్ సరసన హీరోయిన్ ను సెలక్ట్ చేయడం పెద్ద సమస్య కాదు. కాకపోతే తన పాత్రకు కాస్త అనుభవం ఉన్న నటి కావాలంటున్నాడు భాస్కర్. అందుకే షూటింగ్ లేట్ అవుతుందని సమాచారం. త్వరలోనే ఆ హీరోయిన్ ని ఫైనల్ చేయనున్నారు మేకర్స్.