సినిమా కోసం బరువు తగ్గిన అల్లు అర్జున్

అల్లు అర్జున్, త్రివిక్రమ్ సినిమా ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. ప్రకటన చేసి ఇన్నాళ్లు కావొస్తున్నా రెగ్యులర్ షూట్ మొదలుకాలేదు.

అందుకో కారణం ఉందట. అదే బన్నీ మేకోవర్. ఈ సినిమాలో సన్నగా కనిపించడం కోసం అల్లు అర్జున్ బరువు తగ్గుతున్నాడట. అందుకోసం రెగ్యులర్ ఫుడ్ పక్కనపెట్టి ప్రత్యేకమైన డైట్ ఫాలో అవుతున్నాడట. మరీ బన్నీ లీన్ లుక్ ఎలా ఉంటుందో చూడాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే. ఇకపోతే ఈ చిత్రం తరవాత బన్నీ సుకుమార్ డైరెక్షన్లో ఒక సినిమా చేయనున్నాడు