కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన తెలుగు సినీ కార్మికులకు సాయంగా నిలిచారు బాలీవుడ్ అగ్ర కథానాయకుడు అమితాబ్ బచ్చన్. రెండు తెలుగు రాష్ట్రాల్లోని చిత్ర కార్మికుల కోసం తన వంతుగా 12,000 కరోనా రిలీఫ్ కూపన్స్ ను సాయంగా అందించారు.
ఈ విషయాన్ని చిరంజీవి ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. బిగ్‌బి పెద్ద మనసుకు కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేశారు.
తెలుగు సినీ కార్మికుల కోసం అమితాబ్ గారు ఒక్కొకటి రూ.1500 విలువ చేసే 12,000 కరోనా రిలీఫ్ కూపన్స్ ను అందించారు. వీటిని కార్మికుల బిగ్ బజార్ స్టోర్లలో వినియోగించుకోవచ్చు. వీటిని త్వరలోనే అందరికీ అందిస్తాం. సినీ పరిశ్రమ అంతా ఒకే కుటుంబం అని చాటి చెబుతూ బిగ్‌బి చేసిన ఈ పెద్ద సాయానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా అంటూ ట్వీట్ చేశారు చిరంజీవి.