100 కోట్ల కలెక్షన్ సాధించిన ఎఫ్‌2

సంక్రాంతి బరిలో ఎన్నో అంచనాలతో వచ్చిన సినిమాలు బోల్తా కొట్టగా.. ఎఫ్‌2 మాత్రం రికార్డులను క్రియేట్‌ చేస్తోంది. ఎన్టీఆర్‌ కథానాయకుడు, వినయ విధేయ రామ సినిమాలకు కలెక్షన్లు అంతంత మాత్రమే రాగ.. ఎఫ్‌2 మాత్రం కలెక్షన్లలో దూసుకుపోతూ విజయవంతంగా రన్‌ అవుతోంది. ఈ సంక్రాంతికే కాదు..ఈ ఏడాదిలో టాలీవుడ్‌కు ఇదే మొట్టమొదటి బ్లాక్‌బస్టర్‌హిట్‌.

గతేడాది తన సినిమాలతో ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయిన దిల్‌ రాజు.. ఈ సారి మాత్రం సూపర్‌ హిట్‌ చిత్రాన్ని అందించారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని.. కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఎంతో కాలం పాటు సరైన హిట్‌ కోసం ఎదురుచూసిన విక్టరీ వెంకటేష్‌కు ఎఫ్‌2 రూపంలో సూపర్‌ హిట్‌ దొరికింది. ఈ సినిమా వందకోట్ల గ్రాస్‌ను కలెక్ట్‌ చేసినట్టు నిర్మాతలు ప్రకటించారు. ఓవర్సిస్‌లో కూడా ఈ సినిమా దూసుకుపోతోంది. మరి ఈ సినిమా ఫుల్‌రన్‌లో ఇంకా ఎంత వసూలు చేస్తుందో వేచి చూడాలి.