కేజీఎఫ్-2 టీజర్ ఇప్పట్లో లేనట్టే

కేజీఎఫ్‌ చిత్రంతో వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయినా డైరెక్టర్ ప్రశాంత్ నీల్, ప్రస్తుతం కెజిఎఫ్ చిత్రానికి సీక్వెల్ రూపొందించే పనిలో ఉన్నాడు. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా షూటింగ్ కు బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ రాబోతుందంటూ ఓ వార్త సోషల్ మీడియా లో హడావిడి చేయడం తో అంత నిజమే కావొచ్చని ఫిక్స్ అయ్యారు. కానీ ఇప్పట్లో ఎలాంటి టీజర్ రిలీజ్ చేసే ఉద్దేశ్యం లేదని చిత్ర నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు.

ప్రస్తుత పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాత, విడుదల తేదీ చూసుకుని, ఆ తేదీకి దగ్గర సమయంలోనే టీజర్‌ను విడుదల చేస్తామని క్రియేటివ్ ఎగ్జిక్యూటీవ్ ప్రొడ్యూసర్ కార్తీక్ గౌడ ట్విట్టర్ ద్వారా తెలిపారు. దీంతో ఈ చిత్రంపై వినిపిస్తున్న వార్తలకు ఫుల్‌స్టాప్ పెట్టినట్లయింది.