‘ఐరా’ చిత్రములో తొలిసారిగా ద్విపాత్రాభినయాన్ని చేసిన నయనతార

లేడీ సూపర్‌స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార తొలిసారి ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం ‘ఐరా’. కేజేఆర్‌ స్టూడియోస్‌ బ్యానరుపై కోటపాటి రాజేష్‌ నిర్మించిన ఈ చిత్రాన్ని ట్రైడెంట్‌ ఆర్ట్స్‌ రవీంద్రన్‌ విడుదల చేస్తున్నారు. కలైయరసన్‌, యోగిబాబు, జయప్రకాశ్‌, లీలా, మీరాకృష్ణన్‌, సెంథిల్‌ కుమారిలు ఇతర తారాగణం. సర్జన్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సుదర్శన్‌ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిసుతన్న ఈ సినిమాకు సుందరమూర్తి సంగీతం సమకూర్చుతున్నారు.

సెన్సార్‌ అధికారులు ‘యూ/ఏ’ ధ్రువపత్రం ఇచ్చారు. ఈ నెల 28వ తేదీన సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. దర్శకుడు మాట్లాడుతూ ‘నయనతార తొలిసారి ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రానికి నేను దర్శకత్వం చేయడం ఆనందంగా ఉంది. ఈ రెండు పాత్రలకు ఓ సంబంధం ఉంటుంది. అదే సినిమాలో ఆసక్తికరమైన విషయం. వినోదానికి, థ్రిల్లింగ్‌ అంశాలకు ఏ మాత్రం కొదవ ఉండదు. నిర్మాత సహకారంతో సినిమాను ఉత్తమంగా రూపొందించాం. నిర్మాణం విషయంలో ఎక్కడా కాంప్రమైజ్‌ కాలేదు. తప్పకుండా ఈ సినిమాతో మంచి గుర్తింపు వస్తుందని’ పేర్కొన్నారు.