కంగనా రనౌత్‌పై కేసు నమోదు

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌పై కేసు నమోదు అయింది. తన చెల్లి, వ్యక్తిగత మేనేజర్‌ రంగోలి చందెల్‌ను సమర్థిస్తూ రూపొందించిన వీడియోలో ఓ వర్గానికి చెందిన వ్యక్తులను టెర్రిస్టులతో పోల్చడంతో ముంబాయిలోని సబర్బన్ అంబోలీ పోలీస్‌ ఈమెపై కేసు నమోదు చేశారు.

తన సోదరి ట్విట్టర్‌ ఖాతా రద్దుకు ప్రత్యేకంగా ఓ వర్గంలో వ్యక్తులే కారణమని, వారిని టెర్రరిస్టులగా పోలుస్తూ ఓ వీడియోను రూపొందించి విడుదల చేసింది కంగనా. దీంతో అలీ కశ్యఫ్‌ ఖాన్‌ దేశ్‌ముఖ్‌ అనే న్యాయవాది పోలీసులకు ఫిర్యాదు చేశారు.