పోలీసు అధికారిగా మరోసారి స్క్రీన్ పై కనిపించనున్న సూపర్ స్టార్ రజిని కాంత్

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఖాకీ దుస్తులేస్తే అభిమానుల్లో ఉండే ఆ కిక్కే వేరు. గతంలో ఆయన నటించిన ‘మూండ్రు ముగం’ అనే సినిమాలో రజనీ పోలీసు అధికారిగా నటించారు. చాలా కాలం తర్వాత మళ్లీ ఇప్పుడు పోలీసు గెటప్‌లో కనిపించబోతున్నారు.

ప్రస్తుతం రజనీ ప్రముఖ దర్శకుడు ఏ.ఆర్‌ మురుగదాస్‌ తెరకెక్కిస్తున్న ఓ చిత్రంలో నటించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రజనీ పోలీసు అధికారి పోలీసు అధికారికనిపిస్తారని చిత్రవర్గాలు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించాయి. ఎక్కువ భాగం చిత్రీకరణ ముంబయిలో జరగబోతోంది. ఇందులో నయనతార, కీర్తి సురేశ్‌లను కథానాయికలుగా ఎంపిక చేసుకున్నట్లు చిత్రబృందం దాదాపుగా ప్రకటించేసింది. సినిమాకు ‘నార్కలి’ అనే పేరును పరిశీలిస్తున్నట్లు కోలీవుడ్‌ వర్గాలు అన్నాయి. కానీ అందులో వాస్తవం లేదని మురుగదాస్‌ ప్రకటించారు. ఈ సినిమా కోసం తలైవా 90 రోజుల పాటు కాల్‌షీట్స్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలో చిత్రీకరణ మొదలుపెట్టనున్నారు. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.