జ్యోతిక మూవీ కి ‘రాక్షసి’ టైటిల్ ఖరారు

నటి జ్యోతిక నట జీవితం వివాహానంతరం కూడా అప్రతిహతంగా కొనసాగుతోంది. ఇటీవల మణిరత్నం దర్శత్వంలో నటించిన సెక్క సివంద వానం, రాధామోహన్‌ దర్శకత్వంలో హీరోయిన్‌ సెంట్రిక్‌ పాత్రలో నటించిన కాట్ట్రిన్‌ మొళి చిత్రాల విజయాలబాటలో నడిచాయి. ప్రస్తుతం కొత్త దర్శకుడు రాజ్‌ దర్శకత్వంలో నటిస్తున్నారు జ్యోతిక. ఈ సినిమాలో కూడా జ్యోతిక కీలక పాత్రలో నటిస్తున్నారు. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై ఆర్‌ఎస్‌.ప్రకాశ్, ఆర్‌ఎస్‌. ప్రభు నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో నటి పూర్ణిమా భాగ్యరాజ్, సత్యరాజ్, హరీశ్‌ పెరడీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇందులో జ్యోతిక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలి పాత్రలో నటిస్తున్నట్లు తెలిసింది. ఇందుకోసం సుమారు రూ.50 లక్షల ఖర్చుతో పాఠశాల సెట్‌ను వేసి చిత్రీకరణను జరుపుతున్నారు. చిత్ర షూటింగ్‌ దాదాపు పూర్తి కావచ్చిందది. దీంతో చిత్రానికి టైటిల్‌ను నిర్ణయించే పనిలో చిత్ర వర్గాలు నిమగ్నమయ్యారు.

ఈ చిత్రానికి రాక్షసి అనే టైటిల్‌ పరిశీలనలో ఉన్నట్లు తాజా సమాచారం. అదే విధంగా నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సమ్మర్‌ తరువాత విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. నటి జ్యోతిక రాక్షసి చిత్రం పూర్తి కావస్తుండడంతో కొత్త చిత్రానికి రెడీ అయిపోతున్నట్లు తెలుస్తోంది. గులేభాకావళి చిత్రం ఫేమ్‌ కల్యాణ్‌ దర్శకత్వంలో 2డీ ఎంటర్‌టెయిన్‌మెంట్‌ పతాకంపై తన భర్త సూర్య నిర్మించే చిత్రంలో నటించనున్నట్లు సమాచారం. అదే విధంగా తన మరిది కార్తీ నటించనున్న చిత్రంలోనూ ప్రధాన పాత్రను పోషించడానికి పచ్చజెండా ఊపినట్లు టాక్‌.