‘విరాటపర్వం’ ఒక ప్రత్యేకమైన, కంటెంట్ ప్రధాన చిత్రం. ఇందులో రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఇదివరకెన్నడూ మనం చూడని పాత్రల్లో హీరో హీరోయిన్లను ఈ చిత్రం చూపించబోతోంది. లాక్డౌన్ విధించకపోతే, ఈ చిత్రం ఈ సరికి విడుదలకు సిద్ధంగా ఉండేది.
చిన్నపాటి చివరి షూటింగ్ షెడ్యూల్ మినహా, మొత్తం చిత్రీకరణ పూర్తయింది. ‘నీదీ నాదీ ఒకే కథ’ ఫేమ్ వేణు ఊడుగుల డైరెక్ట్ చేస్తోన్న ‘విరాటపర్వం’ చిత్రాన్ని డి. సురేష్‌బాబు సమర్పిస్తోండగా, శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.
ప్రియమణి, నందితా దాస్, నవీన్ చంద్ర, జరీనా వహాబ్, ఈశ్వరీ రావు, సాయిచంద్ కీలక పాత్రధారులైన ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం సమకూరుస్తున్నారు.