డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో “వరల్డ్ ఫేమస్ లవర్” ట్రేండింగ్

దేశ వ్యాప్తంగా కరోనా వల్ల ప్రజలంతా ఇంటికే పరిమితమయ్యారు. లాక్ డౌన్ తో OTT సంస్థలకు, అలాగే టీవీ చానెల్స్ కు మంచి రాబడి వస్తుంది. డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లలో వచ్చే సరికొత్త సినిమాలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటికే పలు సినిమా మంచి వ్యూస్ , టిఆర్పీ రేటింగ్ సాధిస్తున్నాయి.

తాజాగా విజయ్ దేవరకొండ రొమాంటిక్ అండ్ ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ వరల్డ్ ఫేమస్ లవర్ డిజిటల్ ఫార్మాట్ లో దుమ్మురేపుతోంది. ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో ఇండియా వైడ్ గా సెకండ్ పోజిషన్ లో ట్రెండ్ అవుతుంది.

ఈ మూవీ థియేటర్స్ లో అనుకున్నంత విజయం సాధించలేకపోయింది. తెలుగు మరియు తమిళం లో విడుదలైన ఈ చిత్రం నిర్మాతలకు నష్టాలు మిగిల్చింది. అలాంటిది డిజిటల్ ఫార్మాట్ లో ఇంతటి ఆదరణ దక్కించుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.