రెండు రోజులలో 100 కోట్లకు పైగా వసూలు చేసిన రజినీకాంత్

రజినీకాంత్ దర్బార్ సినిమా దూసుకుపోతున్నది. 70 సంవత్సరాల వయసులో 40 ఏళ్ళ యువకుడిగా రజిని చేసిన హంగామా అంతాఇంతా కాదు. రజిని సినిమా హిట్ అయితే ఇలానే ఉంటుంది అని చెప్పకనే చెప్పాడు. మొదటి రోజు రూ. 50 కోట్ల వరకు వసూళ్లు సాధించిన రజిని దర్బార్, రెండో రోజు కూడా అదే హవాను కొనసాగించింది. రెండు రోజుల్లో ఈ సినిమా రూ. 100 కోట్లు క్రాస్ చేసింది. మొదటి రోజుకంటే రెండో రోజే వసూళ్లు అధికంగా ఉన్నాయట. ఇక పండగ సీజన్ కావడంతో రజిని దర్బార్ భారీ వసూళ్లు సాధించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.