సీటిమార్ సినిమాతో తన కుమారుడిని పరిచయం చేస్తున్న డైరెక్టర్

మ్యాచో మాన్ గోపిచంద్ ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రం ఉండబోతుంది. ఈ సినిమాకి ‘సీటీమార్’ అనే టైటిల్ నిర్ణయించారు. ఈ టైటిల్ కు మంచి స్పందనే దక్కింది. ఈ సినిమాతో పరాజయాల నుండి బయటపడాలని సంపత్ నంది గట్టిగా భావిస్తున్నారు. అందుకే చాలా జాగ్రత్తగా సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఈ చిత్రం గత సినిమాలకంటే తనకు చాలా స్పెషల్ అంటున్నారు సంపత్. అందుకు కారణం ఈ సినిమాతో ఆయన కుమారుడు యువ పరిచయంకానున్నాడు. కుమారుడి చేత చిత్రంలో చిన్న పాత్ర ఒకటి వేయించారు సంపత్. ఈ సినిమాను ‘యు టర్న్’ నిర్మాత శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తున్నారు. ఇందులో మిల్కీ బ్యూటీ తమన్నా కథానాయకిగా నటిస్తోంది. మణిశర్మ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు.