జనవరి 13న విడుదల కానున్న డిస్కోరాజా టీజర్

ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న డిస్కో రాజా సినిమా లేటెస్ట్ టీజర్ ని 2.0 పేరుతో ఈనెల 13వ తేదీ సాయంత్రం 4 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు సినిమా యూనిట్ప్రకటించింది.రవితేజ సరసన పాయల్ రాజ్ పుత్, నభ నటేష్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. డిస్కో రాజా సినిమా లేటెస్ట్ టీజర్‌కు ఎస్‌ఎస్ థమన్ స్వరాలు సమకూరుస్తుండగా కార్తీక్ ఘట్టమనేని ఫోటోగ్రఫిని అందిస్తున్నారు.కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాని ఈనెల 24వ తేదీన గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేస్తోంది సినిమా యూనిట్. రవితేజ ఇటీవల కాలంలో కెరీర్ లో బాగా వెనకబడ్డాడు. హిట్టు సినిమా కోసం చూస్తున్నాడు. దీని పై చాలా ఆశలు పెట్టుకున్నాడు. మరి… రవితేజకు ఆశించిన విజయాన్ని అందిస్తుందో లేదో చూడాలి.