చివరకు అల్లు అర్జున్ ని ఒప్పించిన సుకుమార్

అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ నే సుకుమార్ సినిమాకి తీసుకుందామని ప్రపోజల్ పెట్టడమే కాదు.. సుకుమార్ ని ఫోర్స్ చేస్తున్నట్లుగా వార్తలొస్తున్నాయి. సుకుమార్ కు దేవిశ్రీ మీద పూర్తి నమ్మకంతో ఉండడంతో… అల్లు అర్జున్ ని కన్విన్స్ చేస్తూ వస్తున్నాడనే టాక్ వినబడింది. సుకుమార్ కి మాత్రం దేవిశ్రీ మీద పూర్తి నమ్మకం ఉందని.. ఇప్పటివరకు తనతోనే పనిచెయ్యడంతో.. దేవితో కంఫర్ట్ ఉంటుంది అని.. అల్లు అర్జున్ పెట్టిన ప్రపోజల్ ని సుకుమార్ సున్నితంగా తిరస్కరించి, దేవిశ్రీ బెస్ట్ సాంగ్స్ ఇస్తాడని కన్విన్స్ చేశాడట. సుకుమార్ అల్లు అర్జున్ ఏం చెప్పినా వినకుండా దేవిశ్రీ తోనే ఈ సినిమా కంటిన్యూ చెయ్యాలని డిసైడ్ అయ్యి అల్లు అర్జున్ ని కూడా తన దారిలోకి తెచ్చేసుకున్నాడనే టాక్ మాత్రం బాగా వినబడుతుంది.