ప్రముఖ నటుడు నిఖిల్ నిశ్చితార్ధం

నిఖిల్ ‘అర్జున్ సురవరం’ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తో మంచి వసూళ్లను రాబట్టి.. నిఖిల్ కెరీర్ లో బెస్ట్ మూవీస్లో ఒకటిగా నిలిచింది. బ్లాక్ బస్టర్ మూవీతో ఊపు మీద ఉన్న హీరో నిఖిల్ త్వరలో పెళ్లి కొడుకు అవుతున్నాడు. భీమవరం అమ్మాయిని గోవాలో ప్రపొజ్ చేసి తనని మెప్పించి పెద్దల్ని ఒప్పించి ఎక్కడైతే ప్రపొజ్ చేసాడో అదే గోవాలో నిశ్చితార్థం చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే డాక్టర్ పల్లవి వర్మ ని ప్రేమించిన నిఖిల్ అందరి సమ్మతితో ప్రేమ వివాహం చేసుకోబోతున్నాడు. గోవాలో నిన్న పెద్దల సమక్షంలో నిశ్చితార్థం జరుపుకున్నాడు. ఏప్రిల్ 16 న వివాహం చేసుకోబోతున్నాడు.