సరిలేరు నీకెవ్వరూ చిత్రం పై మాట్లాడిన కృష్ణ

మహేష్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సరిలేరు నీకెవ్వరు థియేటర్స్ లోకి వచ్చేసింది. కామెడీ, యాక్షన్, సెంటిమెంట్, సాంగ్స్ ఇలా అన్ని ఉన్న ఫుల్ ప్యాక్డ్ చిత్రం సరిలేరు నీకెవ్వరు అని టాక్ వినపడుతుంది.సరిలేరు నీకెవ్వరు సినిమా చూసిన సూపర్ స్టార్ కృష్ణ చాలా హ్యాపీగా ఫీలయ్యారట. ఆ విషయాన్ని చిత్ర నిర్మాత అనిల్ సుంకర ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. మహేష్ డాన్సులు మరియు నటన , సినిమాను అనిల్ రావిపూడి తీర్చిద్దిన విధానం ఆయనకు విపరీతంగా నచ్చిందట. తమ నిర్మాణంలో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు చిత్రానికి కృష్ణ గారు అభినందలు తెలిపినందు అనిల్ సుంకర ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.