టాప్ టెన్లో మహేష్ బాబుకి మాత్రమే చోటు దక్కింది

ట్విటర్ ఇండియా ‘ట్విట్టర్ టాప్ ట్రెండ్స్‌ 2019’ పేర్లలో టాలీవుడు, బాలివుడ్, కోలీవుడ్ నుంచి చాలా మంది ప్రముఖులు స్థానాన్ని దక్కించుకున్నారు. ఇటు తెలుగు సినిమా రంగంలో టాప్ హీరోగా ఉన్న టాలీవుడ్ నటుడు మహేష్ బాబు ట్విట్టర్ టాప్ ట్రెండ్స్‌నూ స్థానం దక్కించుకున్నాడు. ఈ జాబితాలో తొమ్మిదో స్థానంలో నిలిచి తన జోరును ప్రదర్శించారు. ట్విట్టర్ ప్రకటించిన ఈ జాబితాలో టాలీవుడ్ నుంచి టాప్ టెన్ లో స్థానం పొందింది మహేష్ బాబే కావడం విశేషం.

అదేవిధంగా మహిళల విభాగంలో హీరోయిన్ల జాబితాలో కాజ‌ల్ అగ‌ర్వాల్‌ ఏడో స్థానంలో, ర‌కుల్ ప్రీత్ సింగ్‌లు ప‌దో స్థానంలో ఉన్నారు. ఇక బాలీవుడ్ నటీమణులు సోనాక్షి సిన్హా అగ్రస్థానంలో ఉండగా, అనుష్క శ‌ర్మ రెండో స్థానాన్ని దక్కించుకున్నారు.