సరిలేరు నీకెవ్వరూ లో మాస్ లుక్ తో వస్తున్నా మహేష్ బాబు

క్లాస్‌గా, మిల్కీబాయ్‌లా క‌నిపించే సూప‌ర్‌స్టార్ మహేశ్ ప‌క్కా మాస్ లుక్ కొన్ని సినిమాల్లోనే క‌న‌ప‌డ్డారు. రీసెంట్ టైమ్స్‌లో మాస్ లుక్‌లో లుంగీ క‌ట్టుకుని `శ్రీమంతుడు`, పంచెక‌ట్టులో `భ‌ర‌త్ అనే నేను` సినిమాలో క‌నిపించారు. మ‌రోసారి మాస్ లుక్‌లో క‌న‌ప‌డ‌బోతున్నారు. `మైండ్ బ్లాక్..` సాంగ్‌లో మహేశ్ లుంగీతోనే క‌న‌ప‌డ‌తారు. ట్రైల‌ర్‌లో కొన్ని గ్లింప్స్‌ను అభిమానులు ఎంజాయ్ చేశారు.

తాజాగా ఈ మాస్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఈ కిరాక్ పోజ్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. సంక్రాంతి సంద‌ర్భంగా `స‌రిలేరు నీకెవ్వ‌రు` చిత్రం జ‌న‌వ‌రి 11న విడుద‌ల‌వుతుంది. అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై సుంకర రామబ్రహ్మం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ర‌ష్మిక మందన్న హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రంలో విజ‌య‌శాంతి కీల‌క పాత్ర‌లో న‌టించారు.