బాలీవుడ్ లో రిలీజ్ అయినా మజిలీ సినిమా

టాలీవుడ్ లో నాగ చైతన్యకు మంచి విజయం అందించిన సినిమాల్లో మజిలీ కూడా ఒకటి. నాగ చైతన్య, సమంత జంటగా నటించిన ఈ సినిమా రూ. 50 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది.ఫ్యామిలీ ఆడియన్స్ కు ఈ మూవీ బాగా కనెక్ట్ అయ్యింది. కాగా, ఈ సినిమాను హిందీలో డబ్ చేసి ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో బాలీవుడ్ యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. అక్కడ కూడా ఈ సినిమా మంచి వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఫిబ్రవరి7 వ తేదీన రిలీజ్ చేసిన ఈ సినిమా 14 మిలియన్ కు పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఇండియాలో టాప్ 15 గా ట్రెండ్ అవుతున్నది.