వివాదంలో చిక్కుకున్న నాగశౌర్య

టాలీవుడ్‌ యువకథానాయకుడు నాగశౌర్య ఓ వివాదంతో చిక్కుక్కున్నారు. అశ్వథ్థామ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన నాగశౌర్య. ఈ సినమా ప్రమోషన్‌లో భాగంగా నాగశౌర్య చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైయ్యాయి. టాక్సీ డ్రైవర్ల పట్ల అవమానకరంగా నాగశౌర్య మాట్లాడారని తెలంగాణ రాష్ట్ర టాక్సీ డ్రైవర్స్ జేఏసీ మావన హక్కులకు ఫిర్యాదు చేశారు. దీంతో మానవ హక్కుల సంఘం ఆదేశాలతో ఆయన చేసిన వ్యాఖ్యలపై పోలీసులు కేసు నమోదు చేశారు అశ్వథ్థామ సినిమా ప్రమోషన్‌లో ఓ చానల్ లో మాట్లాడుతూ.. చదువుకోని కొంత మంది డ్రైవర్ వృత్తిని ఎంచుకుంటారని, వాళ్లే మద్యానికి బానిసై నేరాల, ఘోరాలకు పాల్పుడుతున్నారని నాగశౌర్య చెప్పారు. దీంతో డ్రైవర్స్ అసోషియేషన్ తమ మనోభావాలు దెబ్బ తిన్నాయని ,తమ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన నాగశౌర్య క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై వారు మానవహక్కుల కమిషన్ ను ఆశ్రయించారు. వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.