నాగార్జున నటిస్తున్న వైల్డ్ డాగ్ సినిమా షూటింగ్ వాయిదా

ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా వైరస్ ఎంతగా ఇబ్బందులు పెడుతున్నదో అర్ధం అవుతూనే ఉంది. ఈ వైరస్ కారణంగా ప్రపంచం మొత్తం ఆందోళన కరంగా మారింది. లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. రవాణా సౌకర్యాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీని ప్రభావం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీపై కూడా పడింది. తెలుగు సినిమాలు చాలా వరకు విదేశాల్లో షూటింగ్ జరుపుకుంటుంటాయి. థాయిలాండ్ లో షూటింగ్ ఎక్కువగా చేస్తుంటారు.

కానీ, ఇప్పుడు థాయిలాండ్ లో కూడా కరోనా వైరస్ ప్రభావం ఉండటంతో అక్కడి వెళ్ళడానికి భయపడుతున్నారు. నాగార్జున హీరోగా చేస్తున్న వైల్డ్ డాగ్ సినిమా షూటింగ్ హైదరాబాద్ షెడ్యూల్ ముగించుకొని థాయిలాండ్ వెళ్లాల్సి ఉన్నది. కానీ, కరోనా వైరస్ ప్రభావం వలన థాయిలాండ్ లో జరగాల్సిన షూటింగ్ ను క్యాన్సిల్ చేసుకున్నారు. ఇండియాలో మిగతా షెడ్యూల్స్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. కరోనా వైరస్ ప్రభావం తగ్గినా తరువాత అక్కడ షూటింగ్ చేస్తారట. అహిషోర్ సోలొమన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మ్యాట్నీ మూవీస్ పతాకంపై తెరకెక్కిస్తున్నారు.