‘వి’ సినిమా నుండి నాని ఫస్ట్ లుక్ విడుదల చేసిన చిత్రబృందం

‘వి’ సినిమా నుండి నాని ఫస్ట్ లుక్ విడుదల చేసింది చిత్రబృందం. ఫస్ట్ లుక్ లో నాని ఫుల్ గడ్డంతో రఫ్ లుక్ లో.. చేతిలో కత్తెర అలాగే చేయి మీద నుండి కారుతున్న బ్లడ్ తో మొత్తానికి ఈ యాక్షన్ లుక్ తో నాని బాగా ఆకట్టుకున్నాడు. మొత్తానికి ఈ లుక్ సినిమా పై అంచనాలను మరింత పెంచింది. తన తొలి రెండు చిత్రాల్లో నానిని డిఫ‌రెంట్‌గా చూపించిన డైరెక్ట‌ర్ మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి మ‌రో డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్‌లో ఆవిష్క‌రిస్తున్నారు.

హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ నిర్మాణంలో శిరీష్‌, హ‌ర్షిత్ రెడ్డి నిర్మాత‌లుగా ఈ సినిమా నిర్మిత‌మ‌వుతోంది. నాని న‌టిస్తోన్న‌ 25వ చిత్ర‌మిది. ఈ భారీ బ‌డ్జెట్ యాక్ష‌న్ థ్రిల‌ర్ షూటింగ్ పూర్త‌య్యింది. ప్ర‌స్తుతం నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు తుది ద‌శ‌కు చేరుకున్న ఈ సినిమాను ఉగాది సంద‌ర్భంగా మార్చి25న విడుద‌ల చేస్తున్నారు