బాలకృష్ణ సినిమాలో నటించనున్న శ్రీయ మరియు నయనతార

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో హ్యాట్రిక్ మూవీగా త్వరలో ఓ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సింహా, లెజండ్ వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాల తరువాత రాబోతున్న సినిమా కావడంతో అభిమానుల్లో సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన ఇద్దరు ముద్దుగుమ్మలు నటిస్తారని తెలుస్తుంది.

బాలకృష్ణ సరసన నాయన తార, శ్రియ శరన్ నటించే అవకాశం ఉందని తెలుస్తుంది. గతంలో బాలయ్య సరసన సింహా సినిమాలో నయన్ నటించిన విషయం తెలిసిందే. అదే విధంగా శ్రియ కూడా బాలకృష్ణ తో మూడు సినిమాల్లో నటించారు. ఇక ఈ ఇద్దరు భామలతో బాలయ్య సూపర్ హిట్లను అందుకున్నాడు. ఇదే సెంటిమెంట్ ను నమ్ముకొని బాలయ్య సినిమాకు వీరిని ఎంపిక చేసారని తెలుస్తుంది. ఈ కాంబినేషన్ తెరపై కనువిందు చేయడం ఖాయం అని బోయపాటి ధీమాగా ఉన్నారంట.