సందిగ్ధంలో నిశ్శబ్దం మూవీ రిలీజ్ డేట్

అనుష్క ప్రధాన పాత్రధారిగా ‘నిశ్శబ్దం’ రూపొందింది. హేమంత్ మధుకర్ రూపొందించిన ఈ సినిమాను ఈ నెల 31వ తేదీన విడుదల చేయనున్నట్టు చెప్పారు. ఈ సినిమా పోస్టర్స్ కి .. టీజర్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే ప్రచార కార్యక్రమాలు నత్త నడక నడుస్తుండటంతో, ముందుగా చెప్పినట్టుగా ఈ సినిమా ఈ నెల 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాకపోవచ్చనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.

ఈ నేపథ్యంలో ఈ చిత్ర నిర్మాతలలో ఒకరైన కోన వెంకట్ మాట్లాడుతూ,’నిశ్శబ్దం’ సినిమాకి సంబంధించిన అప్ డేట్స్ ను ఇచ్చే విషయంలో పూర్తి క్లారిటీతో వున్నట్టుగా చెప్పారు. ఒక ప్రణాళికతో ముందుకు వెళ్లడానికి తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. సంక్రాంతి పండుగ తరువాత నుంచి అప్ డేట్స్ ఇస్తామని చెప్పారు. అయితే విడుదల తేదీ విషయాన్ని గురించి ఆయన ప్రస్తావించక పోవడంతో సందిగ్ధం కొనసాగుతూనే వుంది.