ఓ పిట్టకథ రిలీజ్ చేయనున్న మహేష్ బాబు

భ‌వ్య క్రియేష‌న్స్ ప్రస్తుతం ఓ పిట్ట క‌థ అనే కాన్సెప్ట్ మూవీ తీస్తున్న సంగ‌తి తెలిసిందే. చెందు ముద్దు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అయితే ఈ సినిమా టీజర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా రిలీజ్చెయ్యనున్నారు . ఫిబ్ర‌వ‌రి 7న సాయంత్రం 5 గంటల 5 నిముషాలకు ఈ చిత్ర టీజ‌ర్ మహేష్ లాంచ్ చెయ్యనున్నారు. వి.ఆనందప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో విశ్వంత్‌ దుద్దుంపూడి, సంజ‌య్ రావు, నిత్యాశెట్టి, బ్రహ్మాజీ, బాలరాజు, శ్రీనివాస్‌ భోగిరెడ్డి, భద్రాజీ, రమణ చల్కపల్లి, సిరిశ్రీ, సూర్య ఆకొండి తదితరులు నటిస్తున్నారు.

ఈ చిత్రం ఒక విలేజ్‌లో జ‌రిగే స్టోరీ నేప‌థ్యంలో న‌డుస్తుందని… ప్ర‌తి స‌న్నివేశం స్వ‌చ్ఛంగా సాగుతూనే క‌డుపుబ్బ న‌వ్విస్తుందని చెబుతుంది చిత్రబృందం. మ‌రోవైపు ఏం జ‌రుగుతోంద‌నే ఉత్కంఠ‌ను రేకెత్తిస్తుందట. ప‌తాక స‌న్నివేశాల వ‌ర‌కూ ఆ థ్రిల్లింగ్ అలాగే స‌స్టైన్ అవుతుందట. ట్విస్టులు మ‌రింత థ్రిల్ క‌లిగిస్తుంటాయట. ఇటీవ‌లే షూటింగ్ పూర్తి చేసుకొని ప్ర‌స్తుతం నిర్మాణాంత‌ర కార్యక్ర‌మాలు జ‌రుపుకుంటున్న ఈ చిత్రంలోని పాత్ర‌ల‌కి సంబంధించిన పోస్ట‌ర్‌ని స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ఆవిష్క‌రించిన విషయం తెలిసిందే.