ప్రకటించిన తేదీన ఇష్మార్ట్ శంకర్ చిత్రంను విడుదల చేయలేకపోతున్న పూరి జ‌గ‌న్నాథ్

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కిస్తోన్న లేటెస్ట్ మూవీ ఇస్మార్ట్ శంక‌ర్. ఎనర్జిటిక్ స్టార్ రామ్‌, నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేష్ హీరోహీరోయిన్స్‌గా రూపొందుతున్న‌ ఇస్మార్ట్ శంక‌ర్ శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఇటీవ‌ల‌ గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం షూటింగ్ ప్ర‌స్తుతం వార‌ణాసిలో జ‌రుగుతుంది.

ప్ర‌ధాన తారాగ‌ణంపై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. ఈ స‌న్నివేశాలు హైలెట్‌గా నిలుస్తాయ‌ట‌. అయితే… సినిమా ప్రారంభోత్స‌వం రోజునే రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసి చెప్పిన డేట్‌కే రిలీజ్ చేసే పూరి ఈ సినిమాని మే నెలలో రిలీజ్ చేస్తామ‌ని ఎనౌన్స్ చేసారు. కానీ.. చెప్పిన‌ట్టుగా మే నెల‌లో ఇస్మార్ట్ శంక‌ర్ ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డం క‌ష్టం అనిపిస్తుంది.

ఎందుకంటే… ఇంకా టాకీ కంప్లీట్ చేయాలి. సాంగ్స్ కూడా బ్యాలెన్స్ ఉన్నాయి. బ‌హుశా ఫ‌స్ట్ టైమ్ అనుకుంట పూరి చెప్పిన డేట్‌కి సినిమాని రిలీజ్ చేయ‌లేక‌పోవ‌డం అనేది. దీనికి కార‌ణం ఏంటంటే… లేట్ అయినా ఫ‌రవాలేదు సినిమా బాగా రావాలని పూరీకి చార్మి సలహాలు ఇస్తోందట. దీనితో పూరీ కూడా చిత్రంపై చాలా కేర్ తీసుకుని ఈ సినిమా చేస్తున్నార‌ట‌. సినిమా బాగా రావాలి అనుకోవ‌డం మంచిదే. ఈసారైనా స‌క్స‌స్ వ‌స్తుందో లేదో మరి..?