కలెక్షన్లతో దుమ్ము రేపిన ప్రతిరోజు పండగే మూవీ

సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ప్రతిరోజూ పండగే’. ఈ సినిమా వసూళ్లతో బాక్సాఫీస్ దుమ్ము దులిపింది. కామెడీ మరియు ఫ్యామిలీ సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ చిత్రం మంచి వసూళ్లను సాధించింది. ఇప్పటివరకూ 34 కోట్లకు పైగానే ఈ సినిమా కలెక్ట్ చేసింది. ఇక ఈ చిత్రం ప్రీ-రిలీజ్ బిజినెస్ 17 కోట్లకు జరిగింది. అంటే సగానికి సగం పైగానే ఈ సినిమా లాభాలను సాధించింది. మొత్తానికి తప్పనిసరిగా హిట్ కావాల్సిన పరిస్థితుల్లో సాయి తేజ్ కి ప్రతిరోజూ పండగే మంచి హిట్ చిత్రంగా నిలిచింది. పైగా ఈ హీరోకు తన కెరీర్ లోనే బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సాధించడం విశేషం.