రజనీకాంత్ బేర్ గ్రిల్స్‌తో కలిసి యాక్షన్ రైడ్ చేశాడు

డెబ్భై ఏళ్ల వయసులో రజిని కాంత్ ఓ సాహస యాత్ర చేశారు. ప్రమాదకర సాహసాలకు పేరుగాంచిన బేర్ గ్రిల్స్ తో కలిసి మ్యాన్ వర్సస్ వైల్డ్ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. ఇందులో భాగంగా కొన్ని ప్రమాదకర సాహసాలు రజని చేశారు. ఐతే ఈ కార్యక్రమంలో రజిని గాయాలపాలయ్యారని తెలియడంతో ఆయన అభిమానులు చాలా ఆందోళన చెందారు. తనకు ఏమైయ్యిందో అని అభిమానులు ఆందోళన చెందుతున్న క్రమంలో రజిని వారికి అసలు విషయం చెప్పారు. తనకు ఆందోళన చెందాల్సినంతటి గాయాలేవీ కాలేదని, కేవలం కాళ్ళ వద్ద చర్మం గీరుకుపోయింది అని మీడియా ఎదుట వివరణ ఇచ్చారు. దానితో ఆయనపై వస్తున్న వదంతులకు చెక్ పెట్టినట్లైంది.