చిరంజీవి సినిమాలో నటించనున్న చరణ్

మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివల కొత్త చిత్రం షూటింగ్ దశలో ఉన్న తెలిసిందే. కొరటాల డైరెక్షన్లో చిరు తొలిసారి చేస్తున్న సినిమా కావడం వలన ప్రేక్షకుల్లో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇందులో చెర్రీ యుక్త వయసులోని చిరు పాత్రలో అది కూడ నక్సలైట్‌గా కనిపిస్తారని తెలుస్తోంది.రాజమౌళి సినిమా షూటింగ్ ముగియగానే చరణ్ ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొంటారట. ఈలోపు కొరటాల చరణ్ పార్ట్ మినహా మిగతా షూట్ పూర్తిచేస్తారట. కొరటాల సినిమాలో చరణ్ పాత్ర నిడివి సుమారు అరగంట ఉంటుందట. అయితే చిరు, చరణ్ మధ్య కాంబినేషన్ సీన్స్ మాత్రం ఉండవు.