వర్కింగ్‌ హాలిడే ఎంజాయ్ చేస్తున్న సమంత

‘సమ్మర్‌ హాలిడేస్‌ స్టార్ట్‌ అయ్యాయోచ్‌’ అంటున్నారు సమంత. అంటే.. షూటింగ్స్‌కు బ్రేక్‌ ఇచ్చి ఫుల్‌ రెస్ట్‌ తీసుకుంటున్నారా? కాదు, కాదు. ఇది వర్కింగ్‌ హాలిడే. నాగార్జున హీరోగా రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో ‘మన్మథుడు 2’ చిత్రం తెరకెక్కుతోంది. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కథానాయిక. నాగార్జున, పి. కిరణ్‌ నిర్మాతలు. ఇందులో సమంత ఓ స్పెషల్‌ రోల్‌లో కనిపించనున్నారు.

తన పార్ట్‌ షూటింగ్‌ కోసం పోర్చుగల్‌లో ఉన్నారు సమంత. ‘‘ముగ్గురు బెస్ట్‌ ఫ్రెండ్స్‌ (రాహుల్‌ రవీంద్రన్, ‘వెన్నెల’ కిశోర్, సమంత) కలసి షూటింగ్‌ చేస్తే చాలా ఫన్‌గా ఉంటుంది’’ అని ఈ ఫొటోను షేర్‌ చేశారు సమంత. ‘మనం, రాజుగారి గది 2’ తర్వాత సమంత, నాగార్జున కలసి యాక్ట్‌ చేస్తున్న మూడో సినిమా ఇది. ఈ చిత్రంలో తన పాత్ర చిత్రీకరణ పూర్తయ్యాక ‘96’ రీమేక్‌ షూట్‌లో జాయిన్‌ అవుతారామె. స్యామ్‌ నటించిన ‘ఓ బేబి’ సినిమా రిలీజ్‌కు రెడీగా ఉంది.