బాలీవుడ్ సినిమాకు నో చెప్పిన సమంత

కెరీర్‌ స్టార్టింగ్‌లో గ్లామర్‌ రోల్స్‌లో నటించిన సమంత పెళ్లి తరువాత నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు మాత్రమే చేస్తోంది. అదే బాటలో సమంత లీడ్‌ రోల్‌లో నటించిన సినిమా యూ టర్న్‌. కన్నడ సూపర్‌ హిట్‌కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగులోనూ పరవాలేదనిపించింది. ఇప్పుడు ఈ సినిమాను బాలీవుడ్‌లో రీమేక్‌ చేసేందుకు రెడీ అవుతున్నారు.తెలుగులో అద్భుతంగా నటించి మెప్పించిన సమంతను హిందీ వర్షన్‌లోనూ నటింప చేసేందుకు కలిసారు. అయితే సమంత మాత్రం ఈ ప్రపోజల్‌ను తిరస్కరించింది. ఒకసారి చేసిన పాత్రను మరోసారి పోషించేందుకు తనకు ఇంట్రస్ట్‌ లేదని తేల్చి చెప్పేసింది.