సరిలేరు నీకెవ్వరూ సినిమా కలెక్షన్ల వర్షం

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు హీరోగా యంగ్‌ అండ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ రెండు తెలుగు రాష్ట్రాలలో విశేష ఆదరణ పొందింది. అవుట్‌ అండ్‌ అవుట్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌ కావడంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్స్ చేసింది. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో ప్రొఫెసర్‌ భారతీగా లేడీ అమితాబ్‌ విజయశాంతి పవర్‌ఫుల్‌ పాత్రలో నటించారు.

ఇక సంక్రాంతికి విడుదలైన ఈ సినిమాని అపూర్వంగా ఆదరిస్తూ సూపర్‌స్టార్‌ మహేష్ బాబు కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ గా నిలిపారు ప్రేక్షకులు, ప్రేక్షకులు సూపర్‌స్టార్ కృష్ణ, అండ్ మహేష్‌బాబు అభిమానులు. కాగా 16 రోజులకు గానూ ఈ సినిమా ఇప్పటివరకూ తెలుగు రాష్ట్రాల్లో రూ. 113.04 కోట్ల షేర్ రాబట్టినట్లుగా చిత్రబృందం ఒరిజినల్ కలెక్షన్స్ అంటూ అధికారికంగా ప్రకటించింది.