నేను ఆన్ ది వే టు టాలీవుడ్ అంటున్న సిద్ధార్థ్

నువ్వొస్తానంటే నేనొద్దాంటానా, బొమ్మరిల్లు, బాయ్స్‌ సినిమాలతో టాలీవుడ్‌లో భారీ క్రేజ్‌ను సొంతం చేసుకున్నాడు సిద్దార్థ్‌. లవర్‌ బాయ్‌గా తిరుగులేని ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్న ఈ హీరో ప్రస్తుతం తెలుగులో ఫేడవుట్‌ అయ్యాడు. చివరగా గృహం అనే ద్విభాషా చిత్రంతో పలకరించి విజయం సాధించాడు. అయినా ఫామ్‌లోకి రాలేకపోయాడు. గత కొన్నేళ్లుగా ఓ మంచి హిట్‌ను కొట్టాలని ప్రయత్నిస్తూనే ఉన్నాడు.

ఈ సందర్భంగా సిద్దార్థ్‌ ట్వీట్‌ చేస్తూ..‘ఎవరేమనుకున్నా నేను వచ్చేస్తున్నానులే. తెలుగు ప్రేక్షకులారా నా ప్రామిస్ ను గుర్తుపెట్టుకోండి .. మంచి కంటెంట్ ను సిద్ధం చేశాను .. నాకు 18 నెలల సమయం ఇవ్వండి .. మిమ్మల్ని అలరించడానికి హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నిస్తాను. నేను ఆన్ ది వే .. మాట్లాడుకుందాం’ అని సోషల్‌ మీడియాలో తెలిపారు. చూస్తుంటే సిద్దూ ఈసారి హిట్‌ కొట్టేలానే కనిపిస్తున్నాడు.