సరిలేరు నీకెవ్వరూ చిత్రంలో నటించిన సూపర్ స్టార్ కృష్ణ

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వస్తోన్న క్రేజీ కమర్షియల్ ఎంటర్ టైనర్ ‘సరిలేరు నీకెవ్వరు’. కాగా సూపర్ స్టార్ కృష్ణ కూడా ‘సరిలేరు నీకెవ్వరు’లో కనిపించబోతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ చిత్రం ప్రీ-రిలీజ్ కార్యక్రమంలో అనిల్ రావిపూడి ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం సూపర్ స్టార్ కృష్ణ ఎంట్రీ సెకెండ్ హాఫ్ లో వచ్చే చిన్న ప్లాష్ బ్యాక్ లో ఉండబోతుందని.. ఎంట్రీ సీన్ అభిమానులకు గూజ్ బంప్స్ వచ్చేలా అద్భుతంగా ఉంటుందని తెలుస్తోంది.

ఇక ఈ సినిమా విడుదలకు ఇక కొన్ని రోజులు మాత్రమే ఉన్నందున, మేకర్స్ తెలుగు రాష్ట్రాల్లో ప్రమోషన్లను వేగవంతం చేస్తున్నారు. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ అవుట్‌ అండ్‌ అవుట్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌ లో మహేశ్ బాబు సరసన రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్‌ విజయశాంతి కూడా ఈ సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రంలో తమన్నా ప్రత్యేక గీతంలో మెరవనుంది. జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చేస్తున్నారు. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.