జ్వాలా రెడ్డి గా కనిపించనున్న తమన్నా

తాజాగా గోపీచంద్ ‘సీటిమార్ ‘ చిత్రంలో నటిస్తున్నాడు. నంది డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమా కబడ్డీ నేపథ్యంలో సాగనుంది. ఇక ఈ సినిమాలో గోపిచంద్ ఆంధ్ర కబడ్డీ జట్టుకు కోచ్ గా వ్యవహరిస్తుండగా.. తమన్నా తెలంగాణ కబడ్డీ జట్టుకు కోచ్ గా నటించనుంది. తాజాగా ఈ సినిమానుంచి తమన్నా ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు చిత్రయూనిట్. ఈ మూవీలో తమన్నా జ్వాలా రెడ్డి గా కనిపించబోతుంది. భూమిక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు.