ఈ నెల 17 న వీ చిత్రం టీజర్ రిలీజ్ కానుంది

విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరున్న మోహన్ కృష్ణ ఇంద్రగంటి నాని హీరోగా తెరకెక్కిస్తున్న ప్రయోగాత్మక చిత్రం ‘వి’. మొదటి నుండి ఈ చిత్ర కథపై సరికొత్త కథనాలు ప్రచురితం అవుతున్నాయి. నాని రోల్ నెగెటివ్ షేడ్స్ లో సాగుతుందని, ఆయన సీరియల్ కిల్లర్ గా కనిపిస్తారని ప్రచారం. దర్శకుడు కూడా పోస్టర్స్ పై డేంజరస్ కొటేషన్స్ తో సినిమా చాల సీరియస్ అన్నట్లుగా హింట్ ఇస్తున్నారు. ఇక సుధీర్ బాబు ఈ మూవీలో నాని ని వెంటాడే, పోలీస్ అధికారిగా కనిపించనున్నాడు.

కాగా వి పోస్టర్స్ లో నాని, సుధీర్ లుక్స్ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. ఈనెల 17న వి మూవీ టీజర్ విడుదల చేయనున్నారు. టీజర్ అనౌన్స్మెంట్ పోస్టర్ లో నాని, సుధీర్ లుక్స్ చాలా సీరియస్ మరియు డేంజరస్ గా ఉన్నాయి. అసలు వి మూవీలో అసలు విలన్ ఎవరనేది ఆసక్తికరమైన విషయం. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంలో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు. నివేదా థామస్, అదితి రావ్ హైదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.