థాయిలాండ్ లో ఉన్న విజయదేవరకొండ

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో యువ హీరో విజయ్ దేవరకొండ నటిస్తోన్న విషయం తెలిసిందే. ఫైటర్ అనే టైటిల్‌తో తెరకెక్కబోతోన్న ఈ చిత్రాన్ని పూరీ, ఛార్మీ, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా దీన్ని నిర్మించబోతున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. ఈ నెలాఖరులో సెట్స్ మీదకు వెళ్లనుంది.

ఈ మూవీ కోసం విజయ్ దేవరకొండ థాయ్‌లాండ్‌కు వెళ్లారట. ఇందులో విజయ్ బాక్సర్‌గా కనిపించనుండగా.. అందుకోసం ఆయన ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారట. దాదాపు 15మంది ట్రైనర్లు మిక్స్‌డ్ మార్షియల్ ఆర్ట్స్‌తో పాటు పలు విద్యల్లో అతడికి శిక్షణ ఇస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ మూవీలో కొత్త లుక్‌లో కనిపించబోతోన్న విజయ్.. అందుకోసం ప్రత్యేకంగా డైట్‌ను ఫాలో అవుతున్నట్లు టాక్. కాగా ఈ మూవీలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.