వరల్డ్ ఫేమస్ లవర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు హైదరాబాద్ లో జరగనుంది

విజయ్ దేవరకొండ హీరోగా ఇంటెన్స్ అండ్ ఎమోషనల్ లవ్ డ్రామా గా తెరకెక్కిన చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్. దర్శకుడు క్రాంతి మాధవ్ ఓ వైవిధ్యమైన కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ ఈనెల 14న ప్రేమికుల రోజు కానుకగా విడుదల కానుంది. ఈనేపథ్యంలో ఈరోజు సాయంత్రం ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ నార్సింగ్ నందు గల కన్వెన్షన్స్& ఎక్సిబిషన్స్ నందు ఈ ఈవెంట్ సాయంత్రం 6 గంటల నుండి జరగనుంది. దర్శక నిర్మాతలు మరియు నటీనటులతో పాటు టాలీవుడ్ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.

క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ లో కె వల్లభ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాశి ఖన్నా, క్యాథరిన్, ఐశ్వర్య రాజేష్, ఇసబెల్లా హీరోయిన్స్ గా నటిస్తుండగా గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు. వరల్డ్ ఫేమస్ లవర్ తెలుగు మరియు తమిళ భాషలలో విడుదల అవుతుంది.