నగర నియోజకవర్గంలో 5 నామినేషన్లు దాఖలు

నగర అసెంబ్లీ నియోజకవర్గానికి గురువారం ఐదుమంది అభ్యర్థులు నామపత్రాలను దాఖలు చేశారు. మంత్రి నారాయణ తరపున నూడా ఛైర్మన్‌ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, పట్టాభిరామిరెడ్డి రెండు సెట్ల నామినేషన్‌ పత్రాలను నగరపాలక సంస్థలోని రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో తెలుగుగంగ ప్రత్యేక కలెక్టర్‌ సదా భార్గవికి అందజేశారు.

వైకాపా అభ్యర్థి పోలుబోయిన అనిల్‌కుమార్‌యాదవ్‌ భార్య జాగృతి, తల్లి శైలజ, పిల్లలతో కలిసి రెండు సెట్ల నామపత్రాలను దాఖలు చేశారు. అలాగే స్వతంత్ర అభ్యర్థులుగా సర్వశ్రీ అరవ కిరణ్‌కుమార్, విఠపు లలితారామ్, చౌడం ప్రసాద్‌లు ఒక్కొక్క సెట్‌ నామినేషన్‌ పత్రాలను అందజేశారు.