జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులకు గట్టి ఎదురుదెబ్బ

కుల్గామ్జిల్లాలోని కెల్లెమ్గ్రామంలో ఆదివారం జరిగిన ఎన్కౌంటర్లో భద్రతాబలగాలు ఐదుగురు ఉగ్రవాదుల్ని హతమార్చాయి. ఉగ్రవాదుల కదలికలపై నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారంతో భద్రతాబలగాలు కెల్లెమ్ను చుట్టుముట్టి గాలింపును ప్రారంభించాయి. బలగాల కదలికల్ని గుర్తించిన ఉగ్రవాదులు కాల్పులు జరుపుతూ అక్కడి నుంచి పరారయ్యేందుకు యత్నించారు.

సందర్భంగా భద్రతాబలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో లష్కరే తోయిబాతో పాటు హిజ్బుల్ముజాహిదీన్కు చెందిన వసీమ్అహ్మద్, అకీజ్నజీర్మీర్, పర్వేజ్అహ్మద్భట్, ఇద్రీస్అహ్మద్, జహీద్అనే ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారు. విషయమై పోలీస్ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. జవాన్తోపాటు పౌరుడిని హత్యచేసిన కేసులో వీరంతా నిందితులని తెలిపారు. అనంతనాగ్, కుల్గామ్జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, భద్రతాసంస్థలపై వీరు గ్రనేడ్దాడులకు పాల్పడ్డారని వెల్లడించారు. ఎన్కౌంటర్అనంతరం ఘటనాస్థలం నుంచి తుపాకులతో పాటు భారీఎత్తున మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.