న్యూజెర్సీలో జరిగిన కాల్పులలో ఆరుగురు మృతి

న్యూజెర్సీలో ఇద్దరు సాయుధులు రెండు ప్రాంతాల్లో విచక్షణారహితంగా కాల్పులు ప్రారంభించారు. ఈ కాల్పుల్లో ఒక పోలీసు అధికారి సహా ఆరుగురు మరణించారు. మరణించిన వారిలో కాల్పులు జరిపిన దుండగులు కూడా ఉన్నారు. స్మశానం వద్ద కాల్పులు ప్రారంభమయ్యాయి. ఒక పోలీస్‌ అధికారి వారిని నిలువరించడానికి చేసిన ప్రయత్నంలో తీవ్రంగా గాయాలపాలయ్యాడు. అనంతరం మృతి చెందాడు. జెసి కోషర్‌ సూపర్‌ మార్కెట్‌ లోపల జరిగిన కాల్పుల్లో ముగ్గురు పౌరులు మృతి చెందారు. కాల్పులు జరిపిన ఇద్దరు దుండగులు పోలీస్‌ కాల్పుల్లో మృతి చెందారు. ఈ దాడి ఎందుకు జరిగిందనే అంశంపై మరిన్ని వివరాలు అందాల్సి ఉందని పోలీసులు చెప్పారు.