చార్టెడ్ విమానం తిరుమల చుట్టూ ఎగురుతోంది

తిరుమలలో చార్టెడ్ విమానం హల్చల్ చేసింది. శ్రీవారి ఆలయంపైకి అతి దగ్గరగా విమానం ఎగిరింది. భౌగోళిక పరిస్థితుల కోసం నేషనల్ సర్వే ఆఫ్ ఇండియా చేయిస్తున్న ఎస్వోఐ సర్వే భాగంగా తిరుమలలో చక్కర్లు కొట్టింది. ఆలయానికి సమీపంలో విమానం చక్కర్లు కొట్టడం ఆగమ విరుద్దమంటున్నారు పండితులు. విమానం ఆలా ఎగరడం అరిష్టమంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. చెన్నై ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ కు టీటీడీ ఫిర్యాుద చేసింది. గతంలోనే తిరుమలను నో ఫ్లైయింగ్ జోన్ ఇవ్వాలన్న రాష్ర్ట ప్రభుత్వ నిర్ణయాన్ని కేంద్రం తోసి పుచ్చింది.