ఆకాశంలోనే విమానం అదృశ్యం

చిలీ దేశానికి చెందిన సీ-130 మిలిటరీ విమానం అదృశ్యమైంది.ఈ ఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకుందని.. ఈ విమానంలో 21 మంది ప్రయాణికులు, 17 మంది సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీంతో మిలిటరీ సిబ్బంది.. విమానం ఆచూకి కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేస్తుంది. ఈ ఘటనపై ఆ దేశ ఆధ్యక్షుడు సెబాస్టియన్ పినెరా స్పందించారు. ‘రక్షణ శాఖ, విమానయాన శాఖ మంత్రులు ఎప్పటికప్పుడు ఈ ఘటనకు సంబంధించిన విషయాలను, గాలింపు చర్యలను పర్యవేక్షించాలి’ అని ఆయన ఆదేశించారు.