ఒడిశా తుఫాను బధితులకు ఎయిర్‌ ఇండియా సహాయం

ఫణి తీవ్ర తుఫానుగా మారి ఒడిశాను ముంచెత్తిన్న విషయం తెలిసిందే. అయితే ఒడిశా తుఫాను బధితులకు ఎయిర్‌ ఇండియా బాసటగా నిలవనుంది. అయితే వారికి అందుకునేందుకు ఎయిర్‌ ఇండియా అధికారులు ముందుకు వచ్చారు.

బాధితులను ఆదుకునేందుకు వీలుగా ఢిల్లీ నుండి సహాయపునరావాస సామాగ్రిని తన విమానంలో ఉచితంగా తీసుకోస్తామని అధికారులు తెలిపారు. దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో స్వచ్ఛంద సంస్థలు, పౌరసంఘాలు, ఒడిశా రెసిడెంట్ కమిషనర్లు సేకరించిన సహాయ పునరావాస సామాగ్రి, బట్టలు, వంటపాత్రలను విమానంలో భువనేశ్వర్ కు తరలిస్తామని ఎయిర్ ఇండియా అధికారులు చెప్పారు.