ముంబై – న్యూయార్క్‌ సేవలను తాత్కాలికంగా రద్దు చేసిన ఎయిరిండియా

ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా ముంబై నుంచి న్యూయార్క్‌కు సేవలను రద్దు చేసింది. ఈ మార్గంలో ప్రయాణికుల నుంచి ఆశించినంత డిమాండ్‌ రాలేదు. దీంతో నష్టపోయిన ఎయిర్‌లైన్స్‌ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. గత డిసెంబరులో ముంబై నుంచి న్యూయార్క్‌లోని జాన్‌ ఎఫ్‌ కెన్నడీ ఎయిర్‌పోర్టుకు డైరెక్ట్‌ ఫ్లయిట్‌ సేవలను ఎయిరిండియా ప్రారంభించింది.

వారానికి మూడు రోజుల చొప్పున విమానాలు నడిపింది. ఐతే ఇటీవల పాక్‌ తన గగనతలాన్ని మూసివేయడంతో ఆ సర్వీసును తాత్కాలికంగా నిలిపివేసింది. జూన్‌లో తిరిగి ఈ సేవలను ప్రారంభించాలని ఎయిర్‌లైన్స్‌ భావించింది. అందుకే ఈ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఎయిరిండియా ప్రతినిధి ఒకరు మీడియాకు తెలిపారు.