రాష్ట్రపతిని కలిసిన అమరావతి రైతులు

ఢిల్లీలో ఈరోజు అమరావతి పరిరక్షణ సమితి ఐకాస నేతలు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను సమీక్షించారు. ఈ సందర్భంగా వారు ఏపిరాజధానిగా అమరావతినే కొనసాగించేలా చొరవ తీసుకోవాలని, కేంద్ర ప్రభుత్వానికి సూచనలు చేయాలనిరాష్ట్రపతికి కోరారు. అమరావతి కోసం రైతులు చేసిన త్యాగాలను వివరించారు. గత 52 రోజులుగా రాజధాని కోసం రైతులు, మహిళలు చేస్తున్న ఆందోళనలను రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు. కాగా వారు పలువురు నేతలను కలుస్తున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కూడా కలిశారు.