55 వ రోజుకు చేరుకున్న అమరావతి రైతుల నిరసన

ఏపి రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ రోజు ఉదయం వినూత్నంగా నిరసనకు దిగారు అక్కడి రైతులు. హైకోర్టుకు న్యాయమూర్తులు వెళ్లే దారిలో బారులు తీరి దండాలయ్యా…మా మొర ఇనండయ్యాగ అంటూ తమ భాద వ్యక్తం చేసారు. న్యాయమూర్తులు వచ్చే సమయంలో దండం పెడుతూ తమ గోడు వినిపించుకునే ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ న్యాయమూర్తులైనా తమ మొర ఆలకిస్తారన్న ఉద్దేశంతో ఈ శాంతియుత నిరసన కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. అలాగే, కృష్ణాయపాలెం శివాలయం సెంటర్‌లో గులాబీపూలు పంచుతూ రైతులు నిరసన చేసారు. కాగా గత 55 రోజులుగా అమరావతి ప్రాంత రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు.