56 వ రోజుకు చేరుకున్న అమరావతి రైతుల నిరసన

ఏపి రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ఆ ప్రాంత రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా నేటికి ఆ ఆందోళనలు 56వ రోజుకి చేరాయి. మందడంలో రైతులు, మహిళలు మహా ధర్నాలో పాల్గొన్నారు. అమరావతిని పరిరక్షించాలంటూ నినాదాలు చేస్తున్నారు. మరోవైపు తుళ్లూరులోనూ రైతులు ధీక్ష ప్రారంభించారు. వెలగపూడి గ్రామస్థులు రిలే దీక్షలు మొదలుపెట్టారు. రాజధాని పరిసర ప్రాంతాల్లోని అన్ని గ్రామాల్లోనూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. కాగా ఇవాళ మందడం, వెలగపూడిలో రైతులు 24 గంటల దీక్షకు పూనుకున్నారు. రాజధాని మార్పుపై ఆందోళనలు తీవ్రతరం చేసేందుకు యత్నిస్తున్నారు.