విశాఖ గ్యాస్ బాదితులకు 20 కోట్ల చెల్లింపు

నేడు విశాఖ గ్యాస్ బాదితులకు 20 కోట్ల చెల్లింపుఎల్.జి.గ్యాస్ బాదితులకు ప్రభుత్వం ప్రకటించిన పరిహారానికి గాను సోమవారం వారి బ్యాంకు ఖాతాల్లో రూ.20 కోట్ల మేర పరిహారాన్ని జమ చేయనున్నారు.ఈ ఘటనలో మరణించిన పన్నెండు మందికి ఇప్పటికే కోటి రూపాయల చొప్పున ఇచ్చేశారు.

తీవ్ర అస్వస్థతతో కేజీహెచ్‌లో మూడు రోజులకు పైగా చికిత్స పొందిన 319 మందికి, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఉన్న 166 మందికి రూ.లక్ష చొప్పున పరిహారం అందజేశారు. వెంటిలేటర్‌పై ఉన్న ఒకరికి రూ.10 లక్షలు పరిహారం చెల్లించారు.

అస్వస్థతతో సీహెచ్‌సీల్లో చికిత్స పొందిన 94 మందికి, కేజీహెచ్‌లో చికిత్స పొంది డిశ్చార్జి అయిన మరో ఐదుగురికి రూ.25 వేలు చొప్పున చెక్కులు అందజేశారు.

స్టైరీన్‌ ప్రభావిత ఐదు గ్రామాలు, పరిసర ఎనిమిది కాలనీల్లో ప్రతి ఒక్కరికి రూ.10 వేల చొప్పున పరిహారం ఇస్తామన్న సీఎం హామీ మేరకు అధికారులు తాజాగా ఎన్యూమరేషన్‌ పూర్తి చేశారు. ఈ ప్రాంతంలో 6,297 ఇళ్లు ఉండగా 20,554 మంది నివాసం ఉంటున్నారు. వారికి పరిహారంగా ప్రభుత్వం రూ.20.55 కోట్లు మంజూరు చేసింది. వలంటీర్ల వ్యవస్థ ద్వారా వివరాలు సేకరించి ఈ పరిహారాన్ని బ్యాంక్ ఖాతాలలో వేస్తున్నారు.